బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఎవరికీ ఓ పట్టాన అర్థం కాదు. సెన్సేషనల్ కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉండే ఆమె, అందరి చూపు తనవైపు తిప్పుకోవడానికే అలా ప్రవర్తించానని ఇటీవల క్లారిటీ ఇచ్చింది. సామ్ బాంబేను పెళ్లాడిన ఆమె వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు. గొడవలు, కొట్లాటలతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వీళ్లు చివరికి ఇద్దరూ విడివిడిగా బతుకుతున్నారు. ప్రస్తుతం పూనమ్.. కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వివాదాస్పద షో 'లాకప్'లో కంటస్టెంట్‌గా పాల్గొంది.
చదవండి: హీరో సూర్యను కలిసిన షణ్ముఖ్ జశ్వంత్
ఈ సందర్భంగా షోలో పూనమ్ మాట్లాడుతూ.. 'నాలుగంతస్థులు ఉండే మా ఇంట్లో ప్రైవేట్ గార్డెన్, టెర్రస్.. ఇలా అన్నీ ఉండేవి. ఎప్పుడైనా నేను ఒంటరిగా ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లినా, నాతో నేను టైం స్పెండ్ చేద్దామనుకున్నా అతడు ఒప్పుకునేవాడే కాదు. ఒక్కదానివే ఏం చేస్తున్నావ్ అంటూ తన వెంటే ఉండమనేవాడు. కనీసం నా ఫోన్ కూడా ముట్టుకోనిచ్చేవాడు కాదు. కుక్కపిల్లలను నాతో పడుకోబెట్టుకుంటే నన్ను కొట్టేవాడు. నన్ను హింసించడం, మందు తాగడం వంటివి నాకు అస్సలు నచ్చకపోయేది ' అని చెప్పుకొచ్చింది.
ఈ వ్యాఖ్యలపై సామ్ బాంబే తీవ్రంగా స్పందించాడు. 'నాలుగేళ్ల నుంచి నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు పెదవి విప్పాల్సిన అవసరం వచ్చింది. నిజానికి మా పెళ్లి మర్చిపోలేని మధురమైన అనుభూతి. సాధారణంగా ఏ రిలేషన్‌లో అయినా పది శాతం గొడవలు, మనస్పర్థలు వంటివి ఉంటాయి. కానీ అందరూ వాటినే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మా విషయంలోనూ అదే జరిగింది. పూనమ్ చెప్పేదంతా పనికిరాని చెత్త. ఆమె ఎప్పుడూ వార్తల్లో ఉండాలని ఇదంతా చేస్తోంది!
గృహ హింస పేరుతో అమాయకులైన ఎంతోమంది మగవాళ్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళ ఒక్క ఫోన్ కాల్ కొట్టిందంటే చాలు పోలీసులు వచ్చి ఆమె భర్తను తీసుకెళ్లి కస్టడీలో ఉంచుతున్నారు. నన్ను అలా సుమారు 20 సార్లు పోలీసులు పట్టుకెళ్లారు, కానీ ఏమీ చేయలేకపోయారు. అంటే మీరే అర్థం చేసుకోండి. అంతదాకా ఎందుకు? మేము హనీమూన్‌కు వెళ్లినప్పుడు కూడా మాలిస్టేషన్ (అత్యాచారం) చేశానని, లైంగిక వేధింపులకు పాల్పడ్డానని ఫిర్యాదు చేసింది. అది కూడా పెళ్లైన వారం రోజులకే! హనీమూన్‌లో ఉన్నప్పుడు భర్త అత్యాచారం చేశాడని ఎలా అంటారో నాకైతే అర్థం కాదు. ఆ తర్వాత ఆమె తప్పు తెలుసుకుని మాలిస్టేషన్ అంటే ఏంటో కూడా తెలీదని చెప్తూ ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. కానీ మగవాడి మాటలను ఎవరూ పట్టించుకోరు. అతడు చెప్పేది నిజమైనా సరే, ఎవరూ నమ్మరు' అని సామ్ బాంబే చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment