హాట్ స్టార్‌తో సంపూ | Kobbari Matta is the sampoornesh babu's new picture | Sakshi
Sakshi News home page

హాట్ స్టార్‌తో సంపూ

Published Fri, Oct 21 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

హాట్ స్టార్‌తో సంపూ

హాట్ స్టార్‌తో సంపూ

సెటైరికల్ డైలాగులతో సంపూర్నేష్ బాబు సునామీలా దూసుకొచ్చిన ‘సింగం 123’ విడుదలై ఏడాదిపైనే అయ్యింది. ఆ సినిమా తర్వాత ‘కొబ్బరిమట్ట’లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాలో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారు. భవానీ మస్తాన్ దర్శకత్వంలో హాట్ స్టార్ పూనమ్ పాండే ప్రధాన పాత్రధారిగా ఫకృద్దీన్ ఖాన్, విజయ్‌భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాలో సంపూ అతిథి పాత్రలో నటిస్తున్నారు.

 నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న ఈ సినిమాలో సంపూ క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ నెలాఖరున ముంబైలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు. ఆశిష్ విద్యార్థి, తాగుబోతు రమేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ఆనెం వెంకటరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement