సంపూర్ణేష్‌ బాబుకు గోల్డెన్‌ ఛాన్స్‌.. ఈ సినిమాతో అక్కడ ఎంట్రీ షురూ | Sampoornesh Babu To Make His Debut In Kollywood - Sakshi
Sakshi News home page

సంపూర్ణేష్‌ బాబుకు గోల్డెన్‌ ఛాన్స్‌.. ఈ సినిమాతో అక్కడ ఎంట్రీ షురూ

Published Mon, Feb 19 2024 9:41 AM | Last Updated on Mon, Feb 19 2024 10:18 AM

Sampoornesh Babu Enter In Kollywood - Sakshi

టాలీవుడ్‌లో నటుడు సంపూర్ణేష్‌ బాబు, స్పూఫ్‌ అంశంతో కూడిన చిత్రాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ, కడుపుబ్బ నవ్విస్తాడు. కోలీవుడ్‌లో ఆయనకు గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కింది. ఈయన ప్రస్తుతం తంగముట్టై అనే చిత్రం ద్వారా తమిళ తెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూ నార్మల్‌ ఫిలిం ఫ్యాక్టరీ తరఫున కేఎం ఇలంజెళియన్, జియో స్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నేతృత్వంలో ఎం.కోటీశ్వరర్‌ రాజూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగులోనూ బంగారుగుడ్డు పేరుతో రూపొందుతోంది.

ఇందులో రోబోశంకర్, శరన్‌రాజ్, త్వాసీమోహన్, సురేఖవాణి ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. సమీపర్‌ టాన్‌టన్‌ సంగీతాన్ని సమకూర్చగా, గోపినాథ్‌ నారాయణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ సంపూర్ణేష్‌ బాబు తెలుగులో హాస్య కథా చిత్రాల్లో నటించినప్పటికీ ఈ చిత్రంలో హాస్యంతో పాటు సీరియస్‌ రోల్‌ చేశారు.

తంగముట్టై చిత్రంలో సంపూ దొంగతనం చేయడం తెలియని దురదృష్ట దొంగ పాత్రలో నటించారు. అకస్మాత్తుగా అతనికి ఒక బంగారు గుడ్డు దొరికితే ఎలా ఉంటుంది అనేది చిత్ర కథాంశం. ద్విభాషా చిత్రం కావడంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో చిత్ర షూటింగ్‌ నిర్వహించారు. ఇది కళ్లల్లో నీళ్లు తిరిగేలా నవ్వించే సినిమా అయినప్పటికీ ఈ సనిమాలో ముఖ్యమైన మెసేజ్‌ ఉంటుంది. ఇది ప్రేక్షకులందరినీ ఆలోచింపచేస్తుంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌ ప్రేక్షకులను సంపూర్ణేష్‌ బాబు తప్పకుండా మెప్పిస్తాడని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement