భర్త సామ్ బాంబే టార్చర్ పెడుతున్నాడంటూ ఆ మధ్య వార్తల్లో నిలిచిన నటి పూనమ్ పాండే తాజాగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. 'సామ్ బాంబే గురించి నేనిప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ప్రస్తుతం ఓ థెరపిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఎవరితోనైనా డేటింగ్ చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఛాన్సే లేదని కుండ బద్ధలు కొట్టింది. ఐదేళ్ల వరకు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోనని స్పష్టం చేసింది.
కాగా పూనమ్.. దర్శకుడు సామ్ బాంబేను 2019 సెప్టెంబర్ 1న పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది. ఆ తర్వాత మరోసారి సామ్ తన మీద చేయి చేసుకున్నాడని పూనమ్ ఆరోపించిన విషయం తెలిసిందే! ఈ గొడవ తర్వాత ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment