వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే పూనమ్ పాండే తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రతి ఒక్కరినీ తనవైపుకు తిప్పుకునేందుకు బోల్డ్ స్టేట్‌మెంట్స్ చేశానని, అదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలియజేసింది. అలా ప్రవర్తించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
సుమారు 17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన పూనమ్ ఆ సమయంలో ఇండస్ట్రీ గురించి ఎలాంటి అవగాహన లేదంది. అందరికంటే విభిన్నంగా ఉండేందుకు, మీడియాను తనవైపు తిప్పుకోవడం కోసం చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశానంది. ఆ స్టేట్‌మెంట్స్ చేసినందుకు ప్రస్తుతం బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది తన కెరీర్ పట్ల పేరెంట్స్ కూడా సంతోషంగా లేరని తెలిపింది.
కొన్నిసార్లు తను చేస్తున్న పాత్రల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఆమెను కొట్టారని పేర్కొంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలాకాలానికి మంచి అవకాశాలు వస్తున్నాయన్న పూనమ్ ఇప్పుడిక పని మీదే దృష్టి పెడతానని స్పష్టం చేసింది. తనను తాను అక్షయ్ కుమార్‌లా ఊహించుకుంటున్నట్లు వివరించింది. ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారికి ఓ సలహా కూడా ఇచ్చింది. చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment