ఈ సెలబ్రిటీలు.. అలా నిద్రపోతారట! | Celebs who love sleeping naked | Sakshi

ఈ సెలబ్రిటీలు.. అలా నిద్రపోతారట!

Published Sat, Jul 30 2016 5:20 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

ఈ సెలబ్రిటీలు.. అలా నిద్రపోతారట!

ఈ సెలబ్రిటీలు.. అలా నిద్రపోతారట!

సెలబ్రిటీలు దగ్గినా, తుమ్మినా వార్తే అవుతుంది. అభిమానుల్లో వాళ్లకుండే క్రేజ్ అలాంటిది మరి. కొంతమంది సినీతారలు వ్యక్తిగత జీవితం విషయంలో చాలా గోప్యత పాటిస్తారు. కానీ మరికొంతమంది ఓపెన్గా అన్నీ చెప్పేస్తుంటారు. అలా కొందరు తారలు ఓపెన్గా చెప్పిన ఓ చిత్రమైన అలవాటేంటో తెలుసా.. దుస్తులు లేకుండా నిద్రపోవడం.

బాలీవుడ్ మ్యాన్లీ హీరో జాన్ అబ్రహాం నటించిన 'డిష్యూం' సినిమా ఇటీవలే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యన జాన్ కేవలం టవల్ మాత్రమే కట్టుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జాన్ పక్కన వరుణ్ ధావన్ కూడా అదే పోజ్లో ఉన్నాడనుకోండి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. తనకి దుస్తులు లేకుండా నిద్రపోవడం ఇష్టమంటూ ఫ్యాన్స్ను పరేషాన్ చేశాడు ఈ డిష్యూం స్టార్

అలాగే 'డిష్యూం' బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా అదే మాట చెప్పి అభిమానులను ఆశ్చర్యపరచింది. నిద్రపోయేటప్పుడు దుస్తులు వేసుకోవడం చాలా చిరాకుగా ఉంటుందంటూ టాప్ సీక్రెట్ను చల్లగా రివీల్ చేసింది.   

నేనేమైనా తక్కువా అంటూ మరో అడుగు ముందుకేసింది మోడల్, నటి పూనమ్ పాండే. ఈమె నటనతో కన్నా నోటితోనే పాపులర్ అయ్యింది. నగ్నంగానే నిద్రపోవాలి.. ఏమో ఎవరికి తెలుసు, కలలో ఎవరిని కలుసుకుంటామో అంటూ తనకలవాటైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాకెక్కింది.

అంతేనా.. ఇంత 'ఓపెన్'గా నిద్రపోయే సెలబ్రిటీలు చాలామందే ఉన్నారట. ఇలాంటి వార్తలు ఎంతమంది ఫ్యాన్స్కు నిద్ర లేకుండా చేస్తాయో!  అయినా వ్యక్తిగత విషయాన్ని చిత్రంగా వాళ్లే చెప్పుకున్నప్పుడు.. విచిత్రంగా మనం మాట్లాడుకోమా ఏంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement