Indigo Airlines Staff Member Vipul Nakashe - Sakshi

Pooja Hegde: పూజా హెగ్డేకు ఘోర అవమానం

Jun 9 2022 5:03 PM | Updated on Jun 9 2022 5:49 PM

Pooja Hegde Slams Indigo Airlines Staff Member - Sakshi

బుట్టబొమ్మ పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో ఇండిగో సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయింది. విపుల్‌ అనే ఉద్యోగి తనతో అసభ్యంగా ప్రవరిస్తూ, ఎలాంటి కారణాలు లేకుండానే వేధించాడని వాపోయింది.

బుట్టబొమ్మ పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో ఇండిగో సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయింది. విపుల్‌ నకాషే అనే ఉద్యోగి తనతో అహంకారంగా, అజ్ఞానంతో మాట్లాడాడని, ఎలాంటి కారణాలు లేకుండానే వేధించాడని చెప్పుకొచ్చింది. సాధారణంగా ఇలాంటి  విషయాల గురించి ట్వీట్‌ చేయనని కానీ ఈరోజు అతడి ప్రవర్తనతో చాలా భయమేసిందని పేర్కొంది పూజా హెగ్డే.

దీనిపై ఇండిగో యాజమాన్యం స్పందిస్తూ సదరు హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పింది. ఇలాంటి అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నట్లు పేర్కొంది. తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

చదవండి: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌
అర్హత ఉన్నోడే అసెంబ్లీలో..పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement