
మార్కెట్ బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా నుంచి వస్తోన్న ఆకాశ ఎయిర్‌కి సంబంధించి తొలి విమానం విశేషాలను నెటిజన్లతో పంచుకున్నారు. హ్యాంగర్ నుంచి బయటకు వచ్చిన విమానం ఫోటోను ట్వీట్ చేస్తూ.. మేము మొదలు పెట్టబోతున్నాం.. మా బేబీ బయటకు వచ్చింది. మీరు కూడా ఓ క్యాప్షన్ పెట్టండి అంటూ ఆకాశ ఎయిర్ కోరింది.
ఆకాశ ఎయిర్ ట్వీట్‌పై మరో ఎయిర్‌లైన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఇండిగో స్పందించింది. హాలివుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ బేబీస్ డే అవుట్‌ను గుర్తుకు తెచ్చేలా బేబీస్ డే అవుట్ అంటూ నవ్వుతున్న రెండు ఎమెజీలు క్యాప్షన్‌గా పెట్టింది. దీనికి అదనంగా ప్లేన్ లేడీ క్రూ చేతిలో ఉన్న చంటి పిల్లాడి ఫోటోను జత చేసింది.
మార్కెట్ బిగ్‌బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గత ఏడాది కాలంగా ఎయిర్‌లైన్ సర్వీసెస్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు సాధించారు. తొలి విడత విమానాలు కూడా కొనుగోలు చేశారు. జులై - ఆగస్టు త్రైమాసికంలో ఆకాశ ఎయిర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Caption this! ✍️
— Akasa Air (@AkasaAir) June 2, 2022
We’ll start – Our baby’s day out! ☺️#ItsYourSky#AvGeek pic.twitter.com/xqRQSxKcXv