
ఇండిగో విమానంలో ఇటీవల ఓ మహిళా ప్యాసింజర్ చేసిన డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలామంది ఇలాంటి వీడియోలు అప్‌లోడ్ చేయడం సాధరణమైందని ఈ వీడియో చూసిన వీక్షకులు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇండిగో సంస్థ ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సల్మాషేక్ అనే మహిళా ప్యాసింజర్ ఈ వీడియోలో నల్లటి చీర కట్టుకుని రజనీకాంత్ నటించిన ‘భాషా’ చిత్రంలోని ‘స్టైల్‌స్టైల్’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను ఇప్పటికే 16 లక్షల మంది వీక్షించారు.
ఇదిలాఉండగా, ఈ వీడియో చూసినవారు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ విమానం తన ప్రైవేట్ ఫ్లైట్ కాదు. ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ‘ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది. పబ్లిక్‌లో ఇలాంటివి చేయడానికి సిగ్గుపడాలి. ఆమె ధైర్యంగా ఉందని అభినందించాలో.. లేదా ఇలా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినందుకు అసహనం వ్యక్తం చేయాలో తెలియడం లేదు’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment