ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రయాణికుడి నుంచి టికెట్ చార్జీలతోపాటు ‘క్యూట్ ఫీజు’వసూలు చేయడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని సదరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వివాదం వైరల్‌గా మారింది. విమాన టికెట్ ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ.. ఇండిగోపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
ఈ పోస్టు ప్రకారం.. శ్రేయాన్ష్ సింగ్ అనే వ్యక్తి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతని వద్ద టికెట్ ధరతో పాటు క్యూట్ ఛార్జ్ కింద రూ.50, ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు కింద రూ.236, యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు కింద రూ.1,003 ఎయిర్‌లైన్ వసూలు చేసినట్లుగా ఉంది. దీన్ని షేర్ చేస్తూ.. ‘‘ఏంటీ క్యూట్ ఫీజు? యూజర్లు అందంగా ఉన్నారని దీన్ని వసూలు చేస్తున్నారా? లేదా మీ విమానాలు క్యూట్‌గా ఉన్నాయని భావిస్తూ దానికి ఛార్జీ తీసుకుంటున్నారా?
ఏంటీ యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు? మీ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను మీరు ఏవిధంగా డెవలప్ చేస్తారు? ఏంటీ ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు? ప్రయాణాల్లో నా భద్రత కోసం ప్రభుత్వానికి నేను పన్నులు కట్టట్లేదా? లేదా విమానాల్లో భద్రత కోసం పౌరవిమానయాన శాఖ ఔట్‌సోర్సింగ్ ఏమైనా ఇచ్చిందా?’’ అని ఆ ప్రయాణికుడు ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే 20లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు.
అయితే దీనిపై ఇండిగో స్పందించింది. ఈ ఛార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది. ‘‘క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్‌మెంట్ ఛార్జ్. సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో మెటల్ డిటెక్టింగ్ మెషిన్‌లు, ఎస్కలేటర్లు, ఇతర పరికరాలను ఉపయోగించినందుకు వీటిని వసూలు చేస్తాం. ఇక, యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు అనేది.. ఎయిర్‌పోర్టులో మెయింటనెన్స్ కోసం ఛార్జ్ చేస్తున్నాం. సెక్యూరిటీ ఫీజు బుకింగ్‌కు సంబంధించినది’ అని ఎయిర్‌లైన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment