ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో.. అబుదాబీకి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1నుంచి బెంగళూరు - అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
భారతీయ ప్రయాణికులకు సేవలందించడం మాత్రమే కాదు, అంతర్జాతీయ పర్యటనను కూడా సులభతరం చేయడానికి ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండిగో వారానికి ఆరు సార్లు బెంగళూరు నుంచి అబుదాబికి, అబుదాబి నుంచి బెంగళూరుకు ఫ్లైట్స్ నడపడానికి సిద్ధమైంది.
బెంగళూరు నుంచి 6E 1438 విమానం మంగళవారం మినహా ప్రతి రోజూ రాత్రి 9:25 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు అబుదాబి చేరుకుంటుంది. అదే విధంగా బుధవారం మినహా అబుదాబి నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి 6E 1439 విమానం మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.
బెంగళూరు నుంచి అబుదాబి వెళ్లాలనుకునే వారికి ఇండిగో చేసిన ప్రకటన ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సంస్థ తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు తమదైన రీతిలో సేవలందిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రయాణికుల అవసరాలను బట్టి తన సర్వీసును మరింత పెంచనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment