న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ ట్రాన్స్‌మిషన్ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(ప్లేస్‌మెంట్) ద్వారా పెట్టుబడులు సమీకరించనున్నట్లు పేర్కొంది.
2023 మే 15కల్లా ఈక్విటీ షేర్లు లేదా ఏ ఇతర అర్హతగల సెక్యూరిటీల జారీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. గత నెల(మే) 13న నిధుల సమీకరణ ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేయగా.. వాటాదారుల నుంచి తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ను పొందినట్లు కంపెనీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment