
మన ఇళ్లలో పాత వస్తువులను చూసిచూసి చెత్తలో పారేయాలంటే మనసొప్పదు.. ఊరికే పారేయలేక ఎంతోకొంత రేటు వస్తే దాన్ని అమ్మడానికి చూస్తారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా పాత వస్తువులను అమ్మగా చేతికి ముట్టిన కొద్ది సొమ్ముతో సంతోషంగానే ఉంటారు. కానీ అనుకున్నదాని కంటే ఊహించని రీతిలో రేటు పలికితే ఎగిరి గంతేస్తాం కదా! సరిగ్గా అలాగే అమెరికా లాస్‌ఏంజెలిస్‌లోని ఒక అబ్బాయి అదే పనిచేశాడు. 21 ఏళ్ల తన ప్రియురాలి హోండా ఆకార్డ్ కారును అమ్మకానికి పెట్టాడు. అంత పాత కారును ఎవరైనా సహజంగా తీసుకోవడానికి వెనుకాడుతారు.
కానీ విచిత్రంగా చాలామంది ఆ కారు కోసం ఎగబడ్డారు. దీనికోసం అతను చేసిందల్లా కాస్తా హాస్యాస్పదంగా అందరినీ ఆకట్టుకునేలా ఒక వాణిజ్య యాడ్‌ను రూపొందించడమే! ఆ వాహనానికి ‘గ్రీనీ’ అని ముద్దు పేరు పెట్టి ఈ–కామర్స్ వెబ్‌సైట్ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టాడు. ఆ యాడ్ వీడియోను సుమారు 40 లక్షల మంది వీక్షించారు. గ్రీనీకి అత్యధికంగా రూ. 97.41 లక్షల రేటు పలికింది. అయితే ఇంత రేటు ఊహించని ఈబే అక్రమ బిడ్డింగ్‌గా పేర్కొంటూ ఆ కారు వేలంను మూసేసింది. 1996 మోడల్‌కి చెందిన ఈ హోండా ఆకార్డ్ కారు ఇప్పటివరకు 1,41,095 మైళ్లు తిరగడం గమనార్హం.. అంత దూరం తిరిగినా అత్యధిక రేటు పలకడం ఆశ్చర్యమే కదా!!!
Comments
Please login to add a commentAdd a comment