జనంపైకి దూసుకెళ్లిన కారు | DWI suspected in crash that hurt 28 at New Orleans parade | Sakshi
Sakshi News home page

జనంపైకి దూసుకెళ్లిన కారు

Published Mon, Feb 27 2017 2:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

జనంపైకి దూసుకెళ్లిన కారు

జనంపైకి దూసుకెళ్లిన కారు

28 మందికి గాయాలు.. అమెరికాలో ఘటన
న్యూ ఓర్లియన్స్: అమెరికాలోని న్యూ ఓర్లియన్స్ పట్టణంలో రాత్రిళ్లు రద్దీగా ఉండే మిడ్‌సిటీ సెక్షన్ లో జన సమూహంపై కారు దూసుకుపోవడంతో ఒక మహిళా పోలీసు అధికారి సహా 28 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు.

బాధితుల్లో మూడు, నాలుగేళ్ల పిల్లల నుంచి 40 ఏళ్ల వ్యక్తుల వరకు ఉన్నారు. ఈ ఘటనకు కారణమయ్యాడనే కారణంతో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసున్నారు. డ్రైవింగ్‌ సమయంలో అతను తీవ్రంగా తాగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇందులో ఉగ్రవాద అనుమానా లేమీ లేవని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement