న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించిన బిడ్డింగ్ తుది గడువును కేంద్రం మే 31 దాకా పొడిగించింది. వాటాల విక్రయానికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తూ వివరణలిచ్చింది. ఎయిర్‌లైన్ ఉద్యోగులతో పాటు ఇతరత్రా ఎవరూ వ్యక్తిగత స్థాయిలో బిడ్ చేయడానికి లేదని స్పష్టం చేసింది.
వాస్తవానికి ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేసేందుకు మే 14 ఆఖరు తేదీ. తాజా సవరణల ప్రకారం ఆర్హత పొందిన బిడ్డర్ల పేర్లను మే 29న కాకుండా జూన్ 15న ప్రకటిస్తారు. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో 76 శాతం వాటాలతో పాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సింగపూర్‌కి చెందిన శాట్స్‌తో జాయింట్ వెంచర్ సంస్థ ఏఐ శాట్స్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment