రష్మిక ఆస్తుల లెక్క తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! | Rashmika Mandanna Net Worth 2021: Luxury Lifestyle, Expensive Assets And Cars | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక అంత ఆస్తి సంపాదించిందా?

Published Wed, Jul 21 2021 11:40 AM | Last Updated on Wed, Jul 21 2021 3:18 PM

Rashmika Mandanna Net Worth 2021: Luxury Lifestyle, Expensive Assets And Cars - Sakshi

Rashmika Mandanna Income: స్వీట్‌.. క్యూట్‌.. బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ను చూపించండయ్యా అనగానే చాలామంది రష్మిక మందన్నా వైపు వేలు చూపిస్తారు. ఆమె అందాన్ని చూసి కుర్రకారు సైతం అబ్బబ్బా.. అమ్మాయెంత ముద్దుగున్నాదే... అంటూ సిగ్గుపడిపోతారు. ఒక్క తెలుగు ప్రేక్షకులనే కాదు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ అంతటా ప్రేక్షకులను బుట్టలో వేసుకుంటోందీ బ్యూటీ. తాజాగా ఈ హీరోయిన్‌ ఆస్తుల గురించి నెట్టింట ఓ కథనం చక్కర్లు కొడుతోంది.


రష్మిక తన లైఫ్‌ను యువరాణిలా ఎంజాయ్‌ చేసేందుకు ఏమాత్రం వెనుకాడదట. తన అవసరాల కోసం ఎంతైనా ఖర్చు పెడుతుందట. ఆమెకు కార్లంటే కూడా బాగానే మోజున్నట్లు తెలుస్తోంది. రష్మిక గ్యారేజీలో ఆడి క్యూ 3, మెర్సిడిస్‌ బెంజ్‌ సీ క్లాస్‌, రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీ, ఇన్నోవా క్రిస్టా, హ్యుండాయ్‌ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. తన ఇష్టాన్ని బట్టి ఎంచక్కా పండక్కో కారులో బయట షికారుకు వెళుతుందన్నమాట! ఇక బాలీవుడ్‌ మీద అలా ఫోకస్‌ పెట్టిందో లేదో అప్పుడే ముంబైలో సొంతంగా ఇల్లు కూడా కొనుక్కుంది. ఇప్పటికే బెంగళూరులోనూ ఓ పెద్ద బంగ్లా ఉండగా రూ.6-8 కోట్లు విలువ చేసే సొంత విల్లా సైతం ఉంది. రష్మికకు హ్యాండ్‌ బ్యాగ్స్‌ అంటేమక్కువ ఎక్కువ. వీటి కోసం ఆమె లక్షల్లోనే ఖర్చుపెడుతుంది. తన కాస్ట్యూమ్స్‌ కోసం కూడా బాగానే ఖర్చు చేస్తుందట. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటిస్తున్న గుడ్‌బై సినిమా ఇంకా రిలీజవకముందే హిందీలో బోలెడు ఆఫర్లు వస్తున్నాయట. అక్కడి నిర్మాతలు రష్మిక కోసం ఒక్క సినిమాకే రూ.4-5 కోట్లు ఇవ్వడానికి కూడా సై అంటున్నట్లు సమాచారం. వాణిజ్య ప్రకటనల కోసం రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తోంది. నికరంగా ఆమె ఆస్తి రూ.35 - 40 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మనం ఊహించినదానికన్నా ఎక్కువ ఆస్తి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు అభిమానులు. మొత్తానికి తక్కువ కాలంలోనే కోట్లు వెనకేసుకుంటూ లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను అనుభవిస్తోందీ హీరోయిన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement