జూలై నుంచి పీఎఫ్ బదిలీలు ఆన్‌లైన్‌లో | Online Provident Fund transfer for workers under private trusts from July | Sakshi
Sakshi News home page

జూలై నుంచి పీఎఫ్ బదిలీలు ఆన్‌లైన్‌లో

Published Sat, Apr 19 2014 1:30 AM | Last Updated on Sun, Sep 2 2018 3:34 PM

జూలై నుంచి పీఎఫ్ బదిలీలు ఆన్‌లైన్‌లో - Sakshi

జూలై నుంచి పీఎఫ్ బదిలీలు ఆన్‌లైన్‌లో

న్యూఢిల్లీ: ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టుల పరిధిలోని సంఘటిత రంగ కార్మికులు వచ్చే జూలై నుంచి తమ పీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్లో బదిలీ చేసుకోవచ్చు. దేశంలో ఇలాంటి ట్రస్టులు 3 వేలకు పైగా ఉన్నాయి. ఇవి తమ పరిధిలోని కార్మికుల రిటైర్మెంట్ ఫండ్‌ను, అకౌంట్లను నిర్వహిస్తుంటాయి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) అజమాయిషీలో ఈ ట్రస్టులు ఉంటాయి. పీఎఫ్ రిటర్నులు దాఖలు చేసే అన్-ఎగ్జెంప్టెడ్ ఫర్మ్‌లు, ప్రైవేట్ ట్రస్టుల మధ్య పీఎఫ్ అకౌంట్ల బదిలీకి ఆన్‌లైన్ సౌకర్యం కల్పించాలని ఈపీఎఫ్‌ఓ భావించింది (తమ కార్మికుల పీఎఫ్ ఖాతాలను ఈపీఎఫ్‌ఓతో కలసి నిర్వహించే కంపెనీలే అన్-ఎగ్జెంప్టెడ్ ఫర్మ్‌లు). జూన్ చివరిలోగా ఆన్‌లైన్ సౌకర్యానికి తగిన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసే యత్నాల్లో ఈపీఎఫ్‌ఓ నిమగ్నమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement