
రతన్ టాటాకు బ్రిటన్ పురస్కారం
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాకు యునెటైడ్ కింగ్‌డమ్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. స్వాతంత్య్రానంతరం ఈ అవార్డును పొందిన తొలి భారతీయుడు ఈయనే. ‘నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (జీబీఈ)’ పేరు కలిగిన ఈ పురస్కారాన్ని క్వీన్ ఎలిజబెత్-2 తరఫున భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ జేమ్స్ బెవాన్... రతన్ టాటాకు ప్రదానం చేశారు. దైపాక్షిక సంబంధాలు, బ్రిటన్‌లో భారత పెట్టుబడుల వృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు రతన్ టాటా చేసిన సేవలకు గుర్తుగా ఈ అవార్డు అందించినట్లు బ్రిటిష్ హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది.