ఫ్లైట్ ఆలస్యమైతే గిఫ్ట్ వోచర్ | SpiceJet to pay passengers for flight delays, cancellations | Sakshi
Sakshi News home page

ఫ్లైట్ ఆలస్యమైతే గిఫ్ట్ వోచర్

Published Tue, May 6 2014 12:49 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

ఫ్లైట్ ఆలస్యమైతే గిఫ్ట్ వోచర్ - Sakshi

ఫ్లైట్ ఆలస్యమైతే గిఫ్ట్ వోచర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రయాణం ఆలస్యమైనా, విమానం రద్దు అయినా ఇక నుంచి స్పైస్‌జెట్ ప్రయాణికులు గిఫ్ట్ వోచర్లు అందుకోవచ్చు. ఆన్ టైమ్ గ్యారంటీ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి స్పైస్‌జెట్ శ్రీకారం చుట్టింది. 60 నిముషాలపైన విమానం ఆలస్యమైతే రూ.500 వోచర్‌ను ఇస్తారు. అది కూడా మరోసారి ప్రయాణించినప్పుడు ఇస్తారు. విమానం రద్దు అయినా, 120 నిమిషాలపైన ఆలస్యమైనా రూ.1,000 వోచర్ అందుకోవచ్చు. నేటి నుంచే ఇది అమలులోకి వస్తుంది. ఇక్కడ ఒక నిబంధన ఉందండోయ్.. వాతావరణం అనుకూలించక పోయినా, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా విమానం రద్దు, ఆలస్యమైనా వోచర్ ఇవ్వరు.

 సంస్థ వల్ల జరిగిన ఆలస్యానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వోచర్ వివరాలు, వినియోగించే విధానాన్ని ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా తెలుపుతారు. గత కొన్ని నెలలుగా సరైన సమయానికి సర్వీసులను నడుపుతున్నట్టు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరణ్ అవిలి ఈ సందర్భంగా తెలిపారు. తమ విమానాలు ఆలస్యం కావని హామీ ఇస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement