
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల వివాహం త్వరలో జరగనుందని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఓ వైపు లంకతో టెస్ట్ సిరీస్ తర్వాత కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. విరుష్క (విరాట్-అనుష్క) జోడీ వివాహం ఈ నెల 12న ఇటలీలో కొందరు సన్నిహితుల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. నటి అనుష్క తరపున కొందరు సన్నిహితులకు ఆహ్వాన పత్రికలు అందినట్లు కూడా తెలుస్తోంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వీరిద్దరికీ ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా అసలు.
'రబ్ నే బనా ది జోడీ'తో బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న అనుష్క శర్మ, బ్యాండ్ బాజా భారత్ వంటి సినిమాలతో ఆమె కెరీర్ పైపైకే ఎగిసింది. ఇదే ఊపులో ఉన్న అనుష్క శర్మ, 2014లో తన సోదరుడితో కలిసి ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించింది. ఈ ప్రొడక్షన్ హౌజ్ కింద ఒక్కో సినిమాకు రూ.5 కోట్లను, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌కు రూ.4 కోట్లను తీసుకుంటోంది. తన వ్యక్తిగత పెట్టుబడులు రూ.36 కోట్ల మేర ఉన్నాయి. రూ.5 కోట్ల విలువ చేసే నాలుగు లగ్జరీ కార్లు.. ఇలా అనుష్క ఆస్తులు రూ.220 కోట్ల మేరకే ఉన్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. వచ్చే మూడేళ్లలో అనుష్క సంపద 30 శాతం మేర పెరిగే అవకాశముంటుందని తెలుస్తోంది.
అదేవిధంగా క్రికెట్ లెజెండ్ అయిన విరాట్ కోహ్లికి కూడా భారీగానే సంపద ఉంది. ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ఆయన అత్యధిక సంపద పొందుతున్నాడు. అంతేకాక ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అత్యధిక చెల్లింపులు అందుకుంటున్న క్రీడాకారుడిల్లో విరాటే ముందంజలో ఉన్నాడు. రెండు నెలల ఈ సీజన్‌లో రూ.14 కోట్లను ఆర్జిస్తున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఈయనకు, పుమా, ఎంఆర్‌ఎఫ్ వంటి బ్రాండ్స్ భారీ ఎత్తున్న ఎండోర్స్‌మెంట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. అత్యధిక బ్రాండు విలువ కలిగిన క్రీడాకారుల్లో ఫోర్బ్స్ జాబితాలో విరాట్ కోహ్లి ఏడవ స్థానంలో ఉన్నాడు. ఈయనకు రూ.42 కోట్లు విలువ చేసే ప్రాపర్టీలు, రూ.18 కోట్ల పెట్టుబడులు, రూ.9 కోట్ల విలువ చేసే ఆరు లగ్జరీ కార్లు... ఇలా విరాట్ మొత్తం రూ.390 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment