వైర్‌లెస్ నెట్‌కు ఇక కనీస స్పీడ్!
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదార్లకు కనీస డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌పై టెలికం కంపెనీల నుంచి త్వరలో స్పష్టమైన, కచ్చితమైన హామీ లభించనుంది. ఈ మేరకు త్వరలో టెల్కోలకు నింయత్రణ సంస్థ ట్రాయ్ మార్గదర్శకాలను జారీచేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో 2జీ లేదా 3జీ ఏ మొబైల్ సేవలకైనా ఇంటర్నెట్‌ద్వారా కనీస డౌన్‌లోడ్ స్పీడ్ ఎంతనే వివరాలను టెల్కోలు తప్పనిసరిగా తమ కస్టమర్లకు వెల్లడించాల్సి ఉంటుంది. తమ మొబైల్స్‌లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుందని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ట్రాయ్ దీనిపై దృష్టిసారించింది. తాజాగా విడుదల చేసిన చర్చాపత్రంలో పలు ప్రతిపాదనలు చేసింది.
ప్రస్తుతం టెల్కోలకు వైర్‌లెస్ డేటా సేవలకు సంబంధించి కనీస స్పీడ్‌ను అందించే విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో కొన్ని కంపెనీలు సెకనుకు 7.2 మెగాబైట్స్(ఎంబీపీఎస్), మరికొన్ని 21 ఎంబీపీఎస్ అంటూ అధిక డేటా స్పీడ్ లతో కస్టమర్లకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. తీరా వాడకానికొస్తే డౌన్‌లోడింగ్ సమయంలో తగిన స్పీడ్ లేక యూజర్లు ఉసూరుమనాల్సిన పరిస్థితి నెలకొంది. హైస్పీడ్ 3జీ నెట్‌వర్క్‌లో కనీస డౌన్‌లోడ్ స్పీడ్ ప్రస్తుతం 399 కేబీపీఎస్ నుంచి 2.48 ఎంబీపీఎస్‌గా స్థాయిలో ఉంది.
కాగా, 3జీ, సీడీఎంఏ(ఈవీడీఓ డాంగిల్) సేవల్లో కనీస డౌన్‌లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌గా(95% కచ్చితత్వం) నిర్ణయించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. అదేవిధంగా జీఎస్‌ఎం, సీడీఎంఏ 2జీ సేవలకు కనీస డౌన్‌లోడ్ స్పీడ్ 56 కేబీపీఎస్‌గా, సీడీఎంఏ హైస్పీడ్ డేటా సేవలకు 512 కేబీపీఎస్‌గా చేయాలనుకుంటోంది. అంతేకాదు ప్రతి టారిఫ్ ప్లాన్‌కు సంబంధించి కనీస డౌన్‌లోడ్ స్పీడ్‌ను రీచార్జ్ వోచర్లు, వెబ్‌సైట్లు, యాడ్‌లలో కూడా కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ చర్చాపత్రంపై అన్నివర్గాలు అభిప్రాయలు తెలిపేందుకు మే 5 వరకు గడువుఇచ్చింది.