సాఫ్ట్‌వేర్ పుణ్యామా అని జీతాలతో పాటు రోగాలు కూడా పెరిగాయి. సూర్యుడితో పాటు మేలుకోవాల్సిన వారం కాస్తా చంద్రుడితో సహవాసం చేస్తున్నాం. అర్ధరాత్రి పూట.. తెల్లవారు జామున తినడం ఈ రోజుల్లో చాల సాధరణం అయ్యింది. ఫలితంగా ఇంట్లో.. ఒంట్లో రకరకాల సమస్యలు. శరీరం బాగుంటే మనసు బాగుంటుంది.. ఆపై అన్ని బాగుంటాయి. మరి అలా ఉండాలంటే పని గంటలకు తగ్గట్టుగా మన ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే పూర్తి ఆరోగ్యంగా ఉండోచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి..
డిన్నర్‌తో రోజు ప్రారంభం..
ఎవరైనా బ్రేక్‌ఫాస్ట్‌తో తమ రోజును ప్రారంభిస్తారు. కానీ నైట్ షిఫ్ట్ చేసే వారు మాత్రం డిన్నర్‌తో తమ రోజును ప్రారంభించాలంటున్నారు నిపుణులు. మీరు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆఫీస్‌కు వెళ్లేటట్లయితే 7 - 7. 30 మధ్య.. సాయంత్ర 4 గంటలకు ఆఫీస్‌కు వెళ్లేవారు రాత్రి ఎనిమిదింటికల్లా డిన్నర్ చేయడం మేలంటున్నారు నిపుణులు.
తేలికపాటి ఆహరం..
డిన్నర్ చేయగానే ఎవరికైనా నిద్ర వస్తున్నట్లు అన్పించడం సహజం. అందుకే నైట్ షిఫ్ట్ చేసేవారు తేలీకపాటి ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయల భోజనం చేయడం.. బ్రౌన్ రైస్ తీసుకోవడం ఉత్తమం. ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫలితంగా చాలా చురుగ్గా పని చేయగల్గుతారు.
ఒక చెంచాడు నెయ్యి..
ఆయుర్వేదం ప్రకారం రాత్రి పూట మెలుకువగా ఉంటే శరీరం పొడిగా తయారవుతుంది. అందువల్ల ఆఫీస్‌కు వెళ్లే ముందు ఓ చెంచాడు నెయ్యి తీసుకుంటే మంచిది. అది శరీరాన్ని పొడిబారకుండా కాపాడుతుంది.
వేపుళ్లు అసలే వద్దు..
ఎక్కువగా వేయించిన పదార్థాలు తినడం వల్ల చాలా ఇబ్బందిగా అన్పించడం మాత్రమే కాకా బరువు కూడా అధికంగా పెరుగుతారు. రాత్రి పూట మన జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉండదు. అందువల్ల రాత్రి సమయంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల అది సరిగా జీర్ణం కాదు ఫలితంగా ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
పప్పులే ఉత్తమం..
రాత్రి పూట పని చేసేటప్పుడు ఆకలిగా అనిపిస్తే ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. వేయించిన శనగలు, బాదం పప్పులు వంటి వాటిని తీసుకోవడం మేలంటున్నారు. పిజ్జా బర్గర్‌లకు దూరంగా ఉండండం మంచిదంటున్నారు.
కాఫీ, టీలు వద్దు..
రాత్రి పూట పనిచేసేవారు మెలకువగా ఉండటం కోసం అదేపనిగా కాఫీ, టీలు తాగుతుంటారు. కానీ దీనివల్ల చేకూరే ప్రయోజనం చాలా తక్కువ. నిద్ర వచ్చినట్లు అనిపిస్తే నీరు తాగడం, తాజా పండ్ల రసాలు తీసుకోవడం మేలంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment