సాక్షి, ప్రకాశం : ఒంగోలును అభివృద్ధి చేశానని డబ్బా కొట్టిన జిల్లా టీడీపీ నాయకుడు ఇప్పుడు పత్తాలేకుండా పోయారని, గత ప్రభుత్వం పర్సంటేజీలు వచ్చే ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని మంత్రి బాలిలేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. సోమవారం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంత్రి బాలినేని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ విస్మరించిన మార్కాపురం మెడికల్ కాలేజ్, రామాయపట్నం పోర్ట్, నిమ్స్ వంటి భారీ ప్రాజెక్టులను త్వరలో ప్రారంభించబోతున్నాం. ('జంతువులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు')
రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అన్నీ సిద్ధం. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఫ్యాక్టరీల పరిస్థితిపై కమిటీలు వేశాం. కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా కొనసాగింపు చర్యలు ఉంటాయి. అందులో ఒంగోలు భగీరథ కూడా ఉంది. దీనిపై ఇప్పటికే కమిటీ వేశాం. కనిగిరి, దర్శీలలో రెండు వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పనున్నాం.
Comments
Please login to add a commentAdd a comment