
ఒంగోలు: వేసవి వచ్చిందంటే చాలు.. బీరు బాటిళ్ల గలగలలు వినిపిస్తుంటాయి. ఒక్కో సందర్భంలో లిక్కర్ కంటే బీర్లే అధికంగా అమ్ముడవుతాయి. ఈ ఏడాది మాత్రం బీరు విక్రయాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. గత నాలుగేళ్లలో మే నెల 8 నుంచి 13వ తేదీ వరకు జరిగిన విక్రయాలను పరిశీలిస్తే 2017లో కనిష్టంగా రోజుకు 2,037 కేసులు, గరిష్టంగా 4,625 కేసుల బీర్లు విక్రయించారు. 2018లో కనిష్టంగా 2,073 కేసులు, గరిష్టంగా 6,591 కేసులు, 2019లో కనిష్టంగా 1,553 కేసులు, గరిష్టంగా 5,397 కేసులు అమ్ముడయ్యాయి.
ఈ నెల 8న లాక్‌డౌన్ మినహాయింపులతో మార్కాపురం(ప్రకాశం 2) మద్యం డిపో ప్రారంభమైంది. మొత్తం ఐదు రోజులపాటు విక్రయాలు జరిగితే అమ్ముడైన బీరు కేసుల సంఖ్య 3,234 మాత్రమే. ఇక ఒంగోలు మద్యం డిపో ఈ నెల 11న ప్రారంభమైంది. అప్పటి నుంచి 13వ తేదీ వరకు కేవలం 695 కేసుల బీరు అమ్ముడైంది. ధరల పెంపు కారణంగా ప్రజలు మద్యానికి దూరం అవుతున్నారని, బీర్ల విక్రయాలపై ధరల పెంపు ప్రభావం ఎక్కువుగా కనిపిస్తోందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. లిక్కర్ విక్రయాలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయని వారు పేర్కొనడంగమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment