ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి చెందారు. కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెదదోర్నల నుంచి పొదిలి మండలం, అక్క చెరువుకు పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బొలేరో వాహనంలో 12 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. బొలెరో గూడ్స్ వాహనం వెనుక డోర్ ఊడిపోవడంతో రోడ్ మీద పడి నలుగురు మృతి చెందారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment