
సాక్షి, ప్రకాశం: పదవ తరగతి పరీక్షలు నిర్వహించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసిన తరువాతే పదవ తరగతి పరీక్షలపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాట్టిస్తూ పరీక్ష కేంద్రాలను కుందించాలా లేక యదావిధిగా సాగించాలా అనే విషయంపై సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా పరీక్షలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం టెలి కాన్ఫరేన్స్ ద్వారా తరగతుల నిర్వహణ జరుగుతోందని, ఆన్‌లైన్‌లో పదవ తరగతి క్లాసులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. ('సిలబస్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి')
కాగా జిల్లాలో 12వేల మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను ఓటు బ్యాంకుగా చుశాయని పేర్కొన్నారు. ఇక కోవిడ్-19 వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ మత్స్యకారులను ఆదుకుంటునన ప్రభుత్వం తమదన్నారు. అంతేగాక కోవిడ్-19 పరీక్షల్లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కరోనా వంటి విపత్కర కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రతిపక్షం విచక్షణ కోల్పోయి విమర్శలు చేస్తూ అవాకులు చవాకులు పేల్చుతున్నాయని ఆయన మండిపడ్డారు. దయచేసిన ప్రతి పక్షాలు చౌకబారు విమర్శలు ఆపాలని, బెల్లు షాపులకు ఆజ్యం పోసిన చంద్రబాబు మద్యం దుఖనాలను విమర్శం విడ్డూరంగా ఉందని మంత్రి విమర్శించారు. (లాక్‌డౌన్ తర్వాత పది పరీక్షలు: సురేష్)
Comments
Please login to add a commentAdd a comment