
పసికందును చంపిన తండ్రి బాలఏసు
యర్రగొండపాలెం:కుటుంబ సభ్యులు తన చిల్లర ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని 6 నెలల ఆడశిశువును కన్న తండ్రి గొంతుపట్టుకొని విసిరి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని అమానిగుడిపాడు ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వైదన బాల ఏసు బీడీల కోసం భార్య విజయులును డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బుల్లేవని చెప్పిన వెంటనే కిందపడుకొని ఉన్న పసికందు గొంతుపట్టుకొని విసిరేశాడు. ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది. బాలఏసుకు మతిస్థిమితం లేదని, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థంకాని పరిస్థితని ఆయన బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.ముక్కంటి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment