కుమార్తెపై తండ్రి లైంగిక దాడి | Father Molestaion on Daughter in Prakasam | Sakshi
Sakshi News home page

కుమార్తెపై తండ్రి లైంగిక దాడి

Published Thu, May 30 2019 1:51 PM | Last Updated on Thu, May 30 2019 1:51 PM

Father Molestaion on Daughter in Prakasam - Sakshi

ప్రకాశం, వెలిగండ్ల: మానవత్వం మరచిన ఓ తండ్రి తన కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక ఎస్సై యు.వి.కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం....వెలిగండ్ల బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. అతనికి ఐదుగురు సంతానం. అతని మూడో సంతానం అయిన ఆ బాలిక 8వ తరగతి చదువుతోంది. ఏడాది క్రితం తల్లి ఇంట్లో లేని సమయంలో కుమార్తెపై లైంగికదాడి చేశాడు.  తండ్రి తరచూ తాగివచ్చి ఇంట్లో వాళ్లను తిట్టడం ..కొట్టడం చేస్తుండేవాడు. దీంతో ఆ బాలిక అద్దంకిలోని తన బంధువుల వద్దకు వెళ్లింది. తిరిగి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడం ఇష్టం లేని ఆ బాలిక చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసింది.

చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధులు ఆ బాలికను నాగులుప్పలపాడులోని ఆశా సదన్‌ హోంలో చేర్పించారు. అక్కడి వారికి తండ్రి చేసిన అఘాయిత్యం గురించి బాలిక చెప్పడంతో...హోం నిర్వాహకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యు.వి.కృష్ణయ్య తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement