‘ఆ దాడుల్లో మృతిచెందిన వారికి రూ. 5 లక్షలు’ | Minister Balineni Srinivasa Reddy Review Meeting With Forest Officials | Sakshi
Sakshi News home page

వన్యప్రాణుల దాడుల మృతులకు రూ. 5 లక్షల పరిహారం

Published Wed, Jun 19 2019 3:31 PM | Last Updated on Wed, Jun 19 2019 4:51 PM

Minister Balineni Srinivasa Reddy Review Meeting With Forest Officials - Sakshi

సాక్షి, అమరావతి : అటవీశాఖ ఉన్నతాధికారులతో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అటవీ విస్తీర్ణంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా ఇప్పటివరకూ రూ. 1688 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఎర్రచందనం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని..5 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి కోరామని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. ఇక వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన వారికి రూ. ఐదు లక్షల పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. పావురాల గుట్టలో ఉన్న వైఎస్సార్‌ స్మృతి వనాన్ని రూ. 25 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement