ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం జిల్లాల వారీగా వైఎస్సార్ సీపీ చేపడుతున్న కార్యక్రమాలు ఉధృతరూపం దాల్చుతున్నాయి. ఉద్యమాన్ని మహోద్యమంగా రూపుదిద్దేందుకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ నెలరోజులపాటు షెడ్యూలు ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమవుతున్న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి.
శాంతియుత మార్గంలో...
శాంతియుత మార్గంలో మహాత్మాగాంధీ అడుగు జాడల్లో ఆయన జయంతి రోజైన అక్టోబరు రెండో తేదీన సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. పార్టీకి చెందిన నియోజకవర్గ సమన్వయకర్తలు తమ నియోజకవర్గ కేంద్రాల్లోనే దీక్షలు చేపట్టనున్నారు. వారితోపాటు వివిధ విభాగాల కన్వీనర్లుకూడా దీక్షలో కూర్చుంటారు.
ఒంగోలులో బాలినేని:
జిల్లా కేంద్రమైన ఒంగోలులో నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి దీక్ష చేపట్టనున్నారు. బుధవారం ఉదయం పదిగంటలకు ఆయన ప్రకాశం భవనం ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్ష చే స్తారు. ఆయనతోపాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టనున్నారు. వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకర్‌రావు కొండపిలో దీక్షలో పాల్గొననున్నారు.ఇప్పటికే ఆయన కొండపి నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో సమీక్షించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదిశగా దృష్టి సారించారు. అద్దంకిలో తాజా మాజీ ఎమ్మెల్యే, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ దీక్ష చేపడతారు. పార్టీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ నూకసాని బాలాజీ, మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామితో కలిసి కందుకూరులో దీక్ష చే స్తారు.
గిద్దలూరు నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్తలైన ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావులు దీక్షలో కూర్చుంటారు. కనిగిరిలో మాజీ మంత్రి ముక్కుకాశిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ కాటం అరుణమ్మ, మార్కాపురంలో ఉడుముల శ్రీనివాసరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, వై.పాలెంలో మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, సంతనూతలపాడులో అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, పర్చూరులో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరశింహారావు, చీరాలలో మాజీ మంత్రి పాలేటి రామారావు, సజ్జాహేమలత, అవ్వారు ముసలయ్య, యడం చినరోశయ్య దీక్షల్లో కూర్చుంటారు. అయితే నియోజకవర్గ సమన్వయకర్తల్లో తూమాటి మాధవరావు(కందుకూరు), జంకే వెంకటరెడ్డి(మార్కాపురం)లు అనారోగ్య కారణాల వల్ల దీక్షలు చేపట్టడం లేదు. దర్శి నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి గురువారం నుంచి దీక్ష చేయనున్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా శాంతియుతంగా వైఎస్సార్ సీపీ పోరాటం
Published Wed, Oct 2 2013 4:07 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement