
సాక్షి, ప్రకాశం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడేటప్పడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు మద్దతుగా ఒంగోలులో శనివారం మంత్రి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. అయిదేళ్లలో చంద్రబాబు చేసిందేమి లేదని విమర్శించారు. చంద్రబాబు ఒక చేతకాని వాడని, ఆయన కొడుకు లోకేశ్ శుద్ధ పప్పు అని మండిపడ్డారు. అమరావతిలో సచివాలయానికి వెళ్లడానికి రోడ్డు కూడా వేయలేని చేతకాని వాడు చంద్రబాబు అని, వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు లేదని దుయ్యబట్టారు. రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపించడం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్న ఉద్దేశంలోనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చారని, దీన్ని ప్రజలు అభినందిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment