![Minister Balineni Srinivas Reddy Participated In Mana Palana Mee Suchana In Ongole - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/27/balineni-srinivasa-reddy.jpg.webp?itok=9LPp0tCM)
సాక్షి, ప్రకాశం: జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన మాపాలన - మీ సూచన కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు సూచనలు,సలహాలు, ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరును అడిగి తెలిసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో అందరూ సంతృప్తిగా ఉన్నారన్నారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను అందించాలని సీఎం గట్టి సంకల్పంతో ఉన్నారు. 98 శాతం తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియంకే మొగ్గు చూపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తాం. తొలి ఏడాది నుంచే ముఖ్యమంత్రి విద్యరంగంలో ఎన్నో గొప్ప పథకాలను అమలు చేస్తున్నారు అని బాలినేని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment