
'రోజా అంటే చంద్రబాబుకు భయం'
ఎమ్మెల్యే రోజాను చూస్తే సీఎం చంద్రబాబునాయుడుకు వణుకు పుడుతోందని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఒంగోలు (ప్రకాశం) :
ఎమ్మెల్యే రోజాను చూస్తే సీఎం చంద్రబాబునాయుడుకు వణుకు పుడుతోందని మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందుకే రోజాను అసెంబ్లీకి రానీయకుండా మరోసారి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని బాలినేని ధ్వజమెత్తారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదన్నారు. జేసీ బ్రదర్స్ పద్దతి మార్చుకోకపోతే జనం తరిమికొడతారని బాలినేని నిప్పులు చెరిగారు.