AP: విద్యుత్‌ ఉద్యోగులకు త్వరలో శుభవార్త | Good News Soon for Electricity Employees: Minister Balineni | Sakshi
Sakshi News home page

AP: విద్యుత్‌ ఉద్యోగులకు త్వరలో శుభవార్త

Published Wed, Dec 29 2021 8:54 AM | Last Updated on Wed, Dec 29 2021 8:55 AM

Good News Soon for Electricity Employees: Minister Balineni - Sakshi

ఏపీ విద్యుత్‌ శాఖ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి   

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ఉద్యోగులు డీఏ విషయంలో త్వరలోనే శుభవార్త వింటారని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) ద్వితీయ వార్షికోత్సవం, విద్యుత్‌ సంస్థల నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను విజయవాడలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు.

13 జిల్లాల నుంచి ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, మూడు డిస్కంలు, నెడ్‌క్యాప్, ఏపీఎస్‌ఈసీఎం, ఏపీసీడ్కో విభాగాల ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలినేని ప్రసంగిస్తూ..పే రివిజన్‌ కమిటీతో జీతాలు తగ్గుతా యని సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలను ఉద్యోగులెవరూ పట్టించుకోవలసిన అవసరం లే దని స్పష్టం చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఇ బ్బందులను పరిగణనలోకి  తీసుకుని వారికి న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటా మని మంత్రి భరోసా ఇచ్చారు.

చదవండి: (పోలీసుల అదుపులో స్మగ్లర్‌ చంద్రబాబు?)

బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను చవకగా కొనుగోలు చేసి రూ.2,500 కోట్లు ఆదా చేయగలిగిన విద్యుత్‌ రంగాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టపర్చడంలో భా గంగా రికార్డు స్థాయిలో ఒకేసారి సుమారు  7,329 మంది లైన్‌ మెన్లను, 213 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లను నియమించామన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రెండేళ్లలో రూ.28,166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.  సీఎండీ జె పద్మజనార్ధన రెడ్డి, ఏపీ జెన్‌కో ఎండీ బి. శ్రీధర్, జేఎండీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement