బాలినేనికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు | a grand welcome to Balineni Srinivas Reddy | Sakshi
Sakshi News home page

బాలినేనికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు

Published Sun, Jun 1 2014 1:46 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

బాలినేనికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు - Sakshi

బాలినేనికి ఆత్మీయ స్వాగతం పలికిన అభిమానులు

 ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి శనివారం ఉదయం ఒంగోలులో ఘన స్వాగతం పలికారు. ఉదయం 5 గంటలకే పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలు రాగానే..బాలినేని నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు.
 
బాలినేని ఇంటి వరకు కార్యకర్తలు ర్యాలీగా వెన్నంటి వచ్చారు. నివాసం వద్ద అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో బాలినేని ముచ్చటించారు. తమ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని స్పష్టం చేశారు. బాలినేనికి స్వాగతం పలికిన వారిలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుతో పాటు జిల్లా నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement