రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందుబాటులోకి రావాలంటే జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఒంగోలు అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందుబాటులోకి రావాలంటే జగన్ నాయకత్వంలో వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన నివాసంలో మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యాదాల అశోక్ ఆధ్వర్యంలో వివిధ మండలాల సభ్యులతో జిల్లా వైద్య విభాగం కమిటీని ఎంపిక చేశారు. బాలినేని చేతుల మీదుగా ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల ఆరోగ్య రక్షణ కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మందికి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించి వారి ప్రాణాలు కాపాడితే తర్వాత పాలకులు ఆ పథకాన్ని పేదలకు దూరం చేశారని అన్నారు.
మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలందించేలా..అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా రూపొందించిన 108, 104ని కూడా నడపలేని దుస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. కుర్చీలు కాపాడుకోవాలనే తపన తప్ప ప్రజా సంక్షేమం పట్టని వాళ్లకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. డాక్టర్ యాదాల అశోక్ మాట్లాడుతూ వైద్యవిభాగం వైఎస్సార్ సీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. జిల్లా వైద్య విభాగ కమిటీకి నూతనంగా ఎంపికైన వారిలో ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ శంకర్‌రెడ్డి (చీరాల), కార్యదర్శులుగా డాక్టర్ ఎస్‌ఎమ్. బాషా (దర్శి), డాక్టర్ రమ (ఒంగోలు), సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ రత్నభారతి (సంతనూతలపాడు), డాక్టర్ రంగారెడ్డి (గిద్దలూరు), డాక్టర్ రఘునాథరెడ్డి (మార్కాపురం), కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ ధనుంజయ్ (కనిగిరి), డాక్టర్ కిషోర్ (కందుకూరు), డాక్టర్ ఆశోక్‌రెడ్డి (శింగరాయకొండ), డాక్టర్ జేసుదాసు (ఒంగోలు), డాక్టర్ వెంకట్రావు (చీరాలు), డాక్టర్ చక్రవర్తి (ఒంగోలు), డాక్టర్ చెంచయ్య (మార్కాపురం) ఉన్నారు. వీరంతా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి కృషి చేస్తారని తెలిపారు.