
సాక్షి, ఒంగోలు : బడికి వెళ్లే విద్యార్థిని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని మున్సిపల్ హైస్కూల్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. తమ పిల్లలకు బడికి పంపిస్తున్న ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 15వేలు ఇచ్చేందుకు కార్యచరణను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment