వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
నాగులుప్పలపాడు, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. నాగులుప్పలపాడులో సోమవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్పే ఆల్‌ఫ్రీ బాబు మాటలను జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు. కిలో బియ్యాన్ని * 5 చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. విశ్వసనీయత లేని నాయకులను జనం నమ్మరని అన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ రావాలంటే అది జగన్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. గ్రామస్థాయి నాయకుల నుంచి తాను పెంచిన వారే కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడగొట్టడంలో ముఖ్యపాత్ర వహించిన చంద్రబాబును జనం విశ్వసించరన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడే వ్యక్తి ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. మారెళ్ల బంగారుబాబు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరడం అభినందనీయమని చెప్పారు.
ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 300 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. మండల పార్టీ కన్వీనర్ దివి పున్నారావు అధ్యక్షత వహించిన కార్యక్రమం లో రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల సుధాకర్, బీసీ సెల్ అధ్యక్షుడు శంకర్, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అంగలకుర్తి రవి, డా. అమృతపాణి, జిల్లా నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, పల్లెర్ల పుల్లారెడ్డి, చుండూరి రవి, గుమ్మడి సాయిబాబా, మాజీ ఎంపీపీ కోనంకి ఆదిలక్ష్మి, మండల నాయకులు మాలె వెంకట్రామిరెడ్డి, అన్నెం వెంకట్రామి రెడ్డి, ఇస్తర్ల అంజయ్య, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.