సాక్షి, ప్రకాశం : మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పచ్చ చొక్కాల నేతలకు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మార్టూరు బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. అయిదు సంవత్సరాల్లో చంద్రబాబు రూ.5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను మోసగించారని విమర్శించారు. అలాగే ఉగాది నాటికి డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేస్తామని అన్నారు. రాజధాని పేరులో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన చంద్రబాబు తన అనుచరులకు ధారాదత్తం చేశారని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ దుయ్యబట్టారు. లక్ష కోట్ల రుపాయలు ఒకే ప్రాంతంలో పెట్టే కంటే అభివృద్ధిని వికేంద్రికరణ చేయడంతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దిశ చట్టాన్ని ఏపీ అమలు చేస్తూ నిందితలకు 21 రోజుల్లో శిక్ష పడే చట్టాన్ని తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment