
సాక్షి, ఒంగోలు : పార్టీలు మారడం, పొత్తు పెట్టుకోవడం ఒక్క చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే సాధ్యమవుతుందని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. మొన్నటి వరకు వామపక్ష పార్టీలతో కలిసి బీజేపీని తిట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆయనకే చెల్లుతందని మండిపడ్డారు. ఎవరు ఎనన్ని పొత్తులు పెట్టుకున్నా తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జంకే పరిస్థితే లేదని అన్నారు. తమ పార్టీ ఏకపక్షంగానే ఉంటుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు ఒకటే స్టాండ్ మీద వున్నారని తెలిపారు.