
సాక్షి, అమరావతి: ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్కు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ శా ఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పా రు. జల సంబంధిత జీవవైవిధ్యం, అంతరించే జంతుజాలం పరిరక్షణ ప్రణాళిక కోసం ఏపీ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, అమరావతి, కర్నూల్చుy వాటి అభివృద్ధికి ప్రణాళికలు ఆమోదించామని, ఇందుకు అవసరమైన భూమి గుర్తించే పనిజరుగుతోందని చెప్పారు.
ఒక్కో పార్కుకు రూ.1.5 కోట్లు, మ్యూజియానికి రూ.50 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. మానవాళి మనుగడకు జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. అడవుల్లోని మొక్కలు, సముద్రపు జీవుల ద్వారానే మనకు మందులు సరఫరా అవుతున్నాయన్నారు. బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డాక్టర్ డి.నళినీమోహన్ మాట్లాడుతూ ఏపీ జీవవైవిధ్య కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment