Biodiversity Park
-
AP: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) పార్కు ఏర్పాటు కానుంది. తద్వారా ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు పార్కుల్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రణాళిక రూపొందించింది. చదవండి: AP: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక పర్యవేక్షణ వీటి ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం లభించింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో 6 ఎకరాలు, కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్‌లో 7.5 ఎకరాలు, తిరుపతిలోని తుడా పరిధిలో ఉన్న వెంకటాపురంలో 6 ఎకరాలు, కడప నగరంలో ఏపీఐఐసీకి చెందిన 6 ఎకరాలను ఇప్పటికే పార్కుల కోసం కేటాయించారు. ఆ భూములను త్వరలో జీవవైవిధ్య మండలికి అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూమి అప్పగించిన వెంటనే పార్కుతోపాటు మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు చేయనుంది. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ పార్కులు, మ్యూజియంల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని జీవవైవిధ్య మండలి ఇప్పటికే కోరింది. కర్నూలు, అమరావతి, అనంతపురం జిల్లాల్లోనూ త్వరలో భూమిని కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత
సాక్షి, అమరావతి: ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్కు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ శా ఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పా రు. జల సంబంధిత జీవవైవిధ్యం, అంతరించే జంతుజాలం పరిరక్షణ ప్రణాళిక కోసం ఏపీ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, అమరావతి, కర్నూల్చుy వాటి అభివృద్ధికి ప్రణాళికలు ఆమోదించామని, ఇందుకు అవసరమైన భూమి గుర్తించే పనిజరుగుతోందని చెప్పారు. ఒక్కో పార్కుకు రూ.1.5 కోట్లు, మ్యూజియానికి రూ.50 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. మానవాళి మనుగడకు జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. అడవుల్లోని మొక్కలు, సముద్రపు జీవుల ద్వారానే మనకు మందులు సరఫరా అవుతున్నాయన్నారు. బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డాక్టర్ డి.నళినీమోహన్ మాట్లాడుతూ ఏపీ జీవవైవిధ్య కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. -
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్.. కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్లే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల ప్రమాదం జరిగిందని తెలిపారు. లోకేశ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లై ఓవర్‌పైకి మళ్లీ వాహనాలను అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. మరో పదిరోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తెరిచే అవకాశముందని తెలిపారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై హైస్పీడ్‌తో వాహనాలు నడిపిన 540 వాహనాలకు పెనాల్టీలు విధించామని, ఇకనుంచి కూడా పెనాల్టీలు కొనసాగుతాయని తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిందని, ఫ్లై ఓవర్ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని నిపుణులు తమ నివేదికలో తేల్చారని వివరించారు. హైస్పీడ్ కారణంగానే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల ప్రమాదం జరిగిందని నిపుణులు నిర్ధారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరమైతే శని, ఆదివారాల్లో ఈ ఫ్లైఓవర్‌ను పోలీసులతో చర్చించి మూసివేస్తామని తెలిపారు. చదవండి: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై దిద్దుబాటు చర్యలు బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరం -
మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
‘నాన్నా.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం వచ్చింది. మన కష్టాలు తీరినట్టే. అన్నట్టు అమ్మకు కూడా ధైర్యం చెప్పు. తమ్ముడు ఎలాఉన్నాడు..’ అంతలోనే పెద్ద శబ్ధం. అవతిలి నుంచి ‘నాన్నా చనిపోతున్నా.. యా అల్లా కాపాడండి’ అంటూ బిడ్డ కుబ్రా ఫోన్ కాల్ కట్టయ్యింది. అంత వరకు కూతురు చెబుతున్న విషయం ఆనందంతో వింటున్న తండ్రి అబ్దుల్ అజీంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఆరు గంటల తర్వాత విషయం తెలిసి నిలువునా కుప్పకూలిపోయాడు. తేరుకుని హడావుడిగా హైదరాబాద్ వెళ్లగా కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్న ఆయనకు సీఎం జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని భోరసా ఇచ్చారు. – అనంతపురం కల్చరల్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్‌పై వేగంగా వెళుతూ కారు కిందపడిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆ పక్కనే ఉన్న అనంతపురం నగరానికి చెందిన పాతికేళ్ల ముస్లిం యువతి కుబ్రా తీవ్రంగా గాయపడింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా రెండు నెలల క్రితం హైదరాబాద్ వెళ్లిన కుబ్రా శనివారం కూడా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగం సాధించింది. ఆ సంతోషాన్ని తండ్రితో పంచుకుంటున్న సమయంలోనే ఓ కారు పైనుంచి వచ్చి పడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన కుబ్రా.. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలోని కేర్ హాస్పిటల్లో జీవన్మరణ పోరాటం చేస్తోంది. చిన్నప్పటి నుంచీ కష్టించే తత్వం అనంతపురం ఆజాద్ నగర్‌కు చెందిన అబ్దుల్ అజీం, షాహిదా దంపతులకు కుబ్రా, అబ్దుల్ ఖాదర్ సంతానం. అజీం పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తొలిసంతానంగా కూతురు పుట్టడంతో మురిసిపోయిన అబ్దుల్ అజీం...దేవుడు తనకిచ్చిన ఘనమైన బహుమతి అనుకున్నాడు. అందుకే కూతురు పేరును కుబ్రా (ఘనమైనది) అని పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచాడు. కుబ్రా కూడా చిన్నతనం నుంచి ఎంతో కష్టించే మనస్ధత్వం కావడంతో అన్నిట్లోనూ రాణించేది. 1 నుంచి 10 వ తరగతి వరకు జూనియర్ కాలేజ్‌లోని ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఇంటర్ సెయింట్ ఆన్స్‌లో, బీటెక్ ఇంటెల్ కాలేజీలో చదివింది. ఇల్లు గడవడమే కష్టమైనా అబ్దుల్ అజీం కూతురును ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమె చదువుల కోసం అప్పులు చేశాడు. ఏది అడిగితే అది సమకూర్చేవాడు. ఈ క్రమంలోనే కుబ్రా ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలని చెబితే... అప్పు చేసి మరీ హాస్టల్లో ఉంచి చదివించాడు. మరో రెండు నెలలు హైదరాబాదులో ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్లాలంటే అక్కడ కూడా హాస్టల్లోనే ఉండడానికి ఒపుకున్నారు. ఏమైతేనేం కూతురుకి మంచి ఉద్యోగం వస్తే అదే చాలనుకున్నాడు. అనుకున్నట్టే బిడ్డ ఉద్యోగం సాధించగా...ఆ వార్త విన్న క్షణాల్లోనే ఆమె ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరడంతో అజీం గుండె ఆగినంత పనైంది. చికిత్స కోసం ఇప్పటిికే రూ.లక్ష ఖర్చు కాగా... వెన్నెముకకు ఆపరేషన్‌కు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి అల్లాడిపోయాడు. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. తల్లడిల్లుతున్న బంధువులు కుబ్రా తల్లి తరఫు చుట్టాలందరూ అనంతపురంలోనే వేర్వేరు ప్రాంతాల్లో కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బంధువులందరికీ నోట్లో నాలుకగా ఉండే ‘కుబ్రా’ ప్రమాదానికి గురైందని తెలియగానే ఆరో రోడ్డులో ఉన్న వాళ్ల పెద్దనాన్న సయ్యద్ బాషా, పెద్దమ్మ సైరాభాను తల్లడిల్లిపోయారు. తమ కూతురును కాపాడాలని అయినవారందరినీ వేడుకుంటున్నారు. చికిత్సకు ఆర్థిక సాయం చేయాలని ఎమ్మెల్యే, ఎంపీల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞాపన పత్రాలను పంపించారు. ఆజాద్ నగర్‌లోని కుబ్రా కుటుంబం అద్దెకుంటున్న ఇల్లు కుబ్రాకు సర్కార్ అండ అనంతపురం సప్తగిరి సర్కిల్: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనంతపురానికి చెందిన కుబ్రాకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. కుబ్రా ఆరోగ్య స్థితి.. ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణం స్పందించారు. యువతికి వైద్య చికిత్స జరిగేలా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్లో నివాసముంటున్న అబ్దుల్ అజీం పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె ఖతిజతుల్ కుబ్రా బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు చేరుకుని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. గత శనివారం ఓ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగానికి కూడా ఎంపికైంది. ఈ సంతోషకరమైన విషయాన్ని అనంతపురంలో ఉన్న తన తండ్రికి సెల్ఫోన్లో చెబుతున్న సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కారు పడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుబ్రా చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇప్పటికే రూ.లక్షకు పైగా ఖర్చు అయ్యింది. అయితే కుబ్రా వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అసలే పేదరికంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ప్రాథమిక వైద్యం కోసం ఉన్న డబ్బును ఖర్చు చేసి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విషయం తెలుసుకున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వెంటనే విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం తక్షణ వైద్యానికి చర్యలు చేపట్టారు. సదరు ఆసుపత్రికి యువతి వైద్యానికి సంబంధించిన ఎల్ఓసీ(లెటర్ ఆఫ్ క్రెడిట్) పంపారు. యువతి ఆపరేషన్‌కు ఎంత ఖర్చయినా భరిస్తామని తెలియజేశారు. ఇదిలా ఉండగా కుబ్రాకు మంగళవారం ఆపరేషన్ చేస్తారని ఆమె సోదరుడు ఖలీఖ్ తెలిపారు. సీఎం స్పందన ఆనందం కలిగిస్తోంది భగవంతున్ని బాగా నమ్మిన కుటుంబాలలో మా చెల్లెలు పిల్లలు కూడా ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని చెప్పేది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్పందించిన తీరు ఎంతో ఆనందం కలిగిస్తోంది. – సయ్యద్‌బాషా, ఆటో డ్రైవర్ ఆశలకు జీవం పోస్తున్న ముఖ్యమంత్రి కుబ్రాను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం తరపున భరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడం కష్టాల్లో అండగా నిలిచే ఆయన మనస్థత్వానికి అద్దం పడుతోంది. ఈ నిర్ణయం ఆమె ఆశలకు జీవం పోస్తుంది. – షేక్షావలి, ఐదవరోడ్డు -
వైవిధ్య వనం
పెదవాల్తేరు (విశాఖతూర్పు) : మొక్కలు అందరూ పెంచుతారు. అంతరించిపోతున్న వృక్షజాతులను సంరక్షించేవారు కొందరే ఉంటారు. ఇలాంటి వారి ఆలోచనల నుంచి పుట్టిందే జీవ వైవిధ్య పార్కు. నగరంలోని పెదవాల్తేరు రాణీచంద్రమణీదేవి ఆస్పత్రి ఆవరణలోని జీవవైవిధ్య ఉద్యానవనానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అర్బన్ కార్పొరేషన్ ఈ పార్కుకు స్పెషల్జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆర్సీడీ ఆస్పత్రి ఆవరణలోని మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కు విస్తరించి ఉంది. ఇక్కడ రెండువేల రకాల వృక్షజాతులను పెంచుతున్నారు. చాలావరకు అంతరించిపోతున్న వృక్షజాతులను ఇక్కడ చూడొచ్చు. వుడా, డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జీవ వైవిధ్య పార్కు పచ్చదనంతో కళకళలాడుతోంది. ఈ పార్కుకు పలురకాల వలస పక్షలు వస్తుంటాయి. ఇంకా 130 రకాల సీతాకోక చిలుకలు ముచ్చటగొలుపుతుంటాయి. సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రామమూర్తి పర్యవేక్షణలో ఈ పార్కు దినదినప్రవర్థమానంగా వెలుగుతోంది. బోటనీ విద్యార్థులకు ఈ పార్కు ఓ ప్రయోగశాలగా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్ తరాలకు తెలియాలనే... దేశంలో దాదాపుగా 400 వరకు అంతరించిపోతున్న వృక్షజా తులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా పది జా తులుగా విభజించి మొక్కలు పెంచుతున్నారు. ఔషధ, సుగం« ద, ముళ్ల, నీటిమొక్కలు, సజీవ శిలాజం, పవిత్రవృక్షాలు, గాలిమొక్కలు, ఆర్కిడ్స్, ఎడారి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఆకట్టుకుంటున్న గ్రీన్హౌస్ బయోడైవర్సిటీ పార్కులో గ్రీన్‌హౌస్‌ను ఒక ప్రత్యేకతగా> చెప్పుకోవచ్చు. ఇక్కడ గాల్లో తేలియాడేలా కుండీలలో మొక్కలు పెంచుతున్నారు. పలురకాల మొక్కలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఈ పార్కు చక్కని ప్రయోగశాలగా ఉపయోగపడుతోంది. వాతవరణ పరిరక్షణ, అధ్యయన, పరిశోధన, అవగాహన కార్యక్రమాలకు డాల్ఫిన్ నేచర్సొసైటీ వేదికగా నిలవడం విశేషం. నగరంలోని బయోడైవర్సిటీ పార్కుకు ప్రభుత్వ స్పెషల్జ్యూరీ అవార్డు రావడంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
శంషాబాద్ వరకు మెట్రో కోసం ఎస్పీవీ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం బయోడైవర్సిటీ పార్క్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు(31 కిలోమీటర్ల) మెట్రో రైలు మార్గాన్ని పొడిగించే పనులు చేపట్టేందుకు వీలుగా ‘హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్’పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్పీవీ)ని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ మెట్రో మార్గానికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డీఎంఆర్సీ) అధికారులు ఇప్పటికే ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్)కు సమర్పించింది. త్వరలో సమగ్ర ప్రాజెక్టు నివేదికను డీఎంఆర్సీ సిద్ధం చేయనుంది. ఈ మార్గంలో మెట్రో స్టేషన్లకు సమీపంలో నూతన టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్పీవీలో హెచ్ఎంఆర్ఎల్కు 51 శాతం వాటా, హెచ్ఎండీఏకు 49 శాతం వాటాలు దక్కనున్నాయి. ఈ ఎస్పీవీ ప్రధానంగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గానికి సంబంధించిన ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, మెట్రో మార్గాన్ని పరీక్షించడం, నిధుల సమీకరణ వంటి పనులు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ఎస్పీవీ ఆధ్వర్యంలో మెట్రో మార్గంలో ప్రత్యేక టౌన్‌షిప్‌లు, షాపింగ్‌మాల్స్, వాణిజ్య కాంప్లెక్స్‌ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులు కల్పించే పనులను చేపట్టనుంది. మెట్రో మార్గంలో ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ప్రధాన రహదారుల విస్తరణ, రవాణా ఆధారిత అభివృద్ధి పనులతోపాటు ప్రజారవాణా వ్యవస్థల అభివృద్ధి తదితర పనులను చేపట్టనుంది. ఎస్పీవీ లిమిటెడ్‌లో ప్రాథమికంగా హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి పేరిట 5.10 లక్షల ఈక్విటీ షేర్లు, 4.89 లక్షల ఈక్విటీ షేర్లను హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు పేరిట కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్పీవీలో ప్రభుత్వం తరఫున నియమించిన ఇతర డైరెక్టర్లకు పది చొప్పున ఈక్విటీ షేర్లు కేటాయించారు. సారథులు వీరే.. హెచ్ఏఎంఎల్ ఎస్పీవీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్వీఎస్రెడ్డి వ్యవహరిస్తారు. డైరెక్టర్లుగా కె.రామకృష్ణారావు(ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి), సునీల్‌శర్మ(ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి), అరవింద్‌కుమార్(మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి), జయేశ్‌రంజన్(ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి), టి.చిరంజీవులు(హెచ్ఎండీఏ కమిషనర్). -
టీసీఎస్ క్యాంపస్‌లో మొక్కలు నాటిన కేటీఆర్
-
టీసీఎస్ క్యాంపస్‌లో మొక్కలు నాటిన కేటీఆర్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్‌లో మొక్కలు నాటారు. నాటిన మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. హరితహారాన్ని ఓ ఉద్యమంగా నిర్వహిస్తామన్నారు. ఇకనుంచి మొక్కలు నాటితేనే భవనాల నిర్మాణాలకు అనుమతి ఇస్తామని కేటీఆర్ వెల్లడించారు. అలాగే మొక్కలు నాటేవారికి ప్రోత్సాహాలు కూడా అందచేస్తామన్నారు. ఒక్కరోజే 25 లక్షలు మొక్కలు నాటుతున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే నిరంతరం హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచాలన్నారు. చెట్లు లేకపోవడం వల్ల సకాలంలో వర్షాలు పడటం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనంతరం బయో డైవర్సిటీ పార్కులోనూ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీతో పాటు టీసీఎస్ ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా నగరంలో నేడు 4,173 ప్రాంతాల్లో హరితహారం చేపట్టనున్నారు. ఇవాళ ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి కేటీఆర్ నిమ్స్‌లో, చిత్రపురికాలనీలో రాజేంద్రప్రసాద్, పలువురు నటులు మొక్కలు నాటనున్నారు. -
రాహ్‌గిరి జోష్..
-
రాహ్‌గిరిలో నైజీరియన్ల సందడి
రాయదుర్గం: రాయదుర్గంలోని బయోడైవర్శిటీ పార్కు రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ జంక్షన్ వరకున్న రోడ్డులో ఆదివారం రాహ్‌గిరి కార్యక్రమంలో సందడి నెలకొంది. నైజీరియన్లు సందడి చేశారు. 1960 అక్టోబర్ 1న స్వాతంత్య్రం పొందిన నైజీరియా దేశస్థులు నైజీరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణా స్టేట్ ఆధ్వర్యంలో ప్రీ ఇండిపెండెన్స్ వాక్‌ను ’ఎ వాక్ ఫర్ చేంజ్’ పేరిట నిర్వహించారు. ఈ వాక్‌లో పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు. విధ రకాల ఆటలు, ఫన్ గేమ్స్, నృత్యప్రదర్శనలు, గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఫిట్జాప్ ఆధ్వర్యంలో చిన్నారులు, ఇతరులకు ఫిట్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. షెల్ స్టూడియో డిజైన్ ఎన్ ఎల్ఎల్పి ఆధ్వర్యంలో స్నేక్ అండ్ ల్యాడర్ పోటీలు, డెవిల్స్ సర్య్కూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినూత్న క్రీడ, కియా డాల్స్, ఫేస్ పేయింటింగ్ కార్యక్రమాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్ ఫ్రీ థర్స్డే కార్యక్రమంపై ప్రచారం చేశారు. -
సందడిగా రాహ్‌గిరి
-
ఉల్లాసంగా రాహ్‌గిరి
-
సందడి..సందడిగా రాహ్‌గిరి