సాక్షి, హైదరాబాద్: బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్లే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల ప్రమాదం జరిగిందని తెలిపారు. లోకేశ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లై ఓవర్‌పైకి మళ్లీ వాహనాలను అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు. మరో పదిరోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ తెరిచే అవకాశముందని తెలిపారు.
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై హైస్పీడ్‌తో వాహనాలు నడిపిన 540 వాహనాలకు పెనాల్టీలు విధించామని, ఇకనుంచి కూడా పెనాల్టీలు కొనసాగుతాయని తెలిపారు. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నిపుణుల కమిటీ నివేదిక వచ్చిందని, ఫ్లై ఓవర్ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని నిపుణులు తమ నివేదికలో తేల్చారని వివరించారు. హైస్పీడ్ కారణంగానే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల ప్రమాదం జరిగిందని నిపుణులు నిర్ధారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరమైతే శని, ఆదివారాల్లో ఈ ఫ్లైఓవర్‌ను పోలీసులతో చర్చించి మూసివేస్తామని తెలిపారు.
చదవండి: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై దిద్దుబాటు చర్యలు
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం
మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరం
Comments
Please login to add a commentAdd a comment