రాహ్‌గిరిలో నైజీరియన్ల సందడి | Nigerian noise in rahgiri | Sakshi
Sakshi News home page

రాహ్‌గిరిలో నైజీరియన్ల సందడి

Published Mon, Sep 28 2015 12:29 AM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM

రాహ్‌గిరిలో నైజీరియన్ల సందడి - Sakshi

రాహ్‌గిరిలో నైజీరియన్ల సందడి

రాయదుర్గం: రాయదుర్గంలోని బయోడైవర్శిటీ పార్కు రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ జంక్షన్ వరకున్న రోడ్డులో ఆదివారం రాహ్‌గిరి కార్యక్రమంలో సందడి నెలకొంది. నైజీరియన్లు సందడి చేశారు.  1960 అక్టోబర్ 1న స్వాతంత్య్రం పొందిన నైజీరియా దేశస్థులు నైజీరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణా స్టేట్ ఆధ్వర్యంలో ప్రీ ఇండిపెండెన్స్ వాక్‌ను ’ఎ వాక్ ఫర్ చేంజ్’ పేరిట నిర్వహించారు. ఈ వాక్‌లో పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.

విధ రకాల ఆటలు, ఫన్ గేమ్స్, నృత్యప్రదర్శనలు, గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఫిట్‌జాప్ ఆధ్వర్యంలో చిన్నారులు, ఇతరులకు ఫిట్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. షెల్ స్టూడియో డిజైన్ ఎన్ ఎల్‌ఎల్‌పి ఆధ్వర్యంలో స్నేక్ అండ్ ల్యాడర్ పోటీలు, డెవిల్స్ సర్య్కూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినూత్న క్రీడ, కియా డాల్స్, ఫేస్ పేయింటింగ్  కార్యక్రమాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్ ఫ్రీ థర్స్‌డే కార్యక్రమంపై ప్రచారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement