Rahgiri program
-
రాహ్‌గిరి జోష్..
-
రాహ్‌గిరిలో నైజీరియన్ల సందడి
రాయదుర్గం: రాయదుర్గంలోని బయోడైవర్శిటీ పార్కు రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ జంక్షన్ వరకున్న రోడ్డులో ఆదివారం రాహ్‌గిరి కార్యక్రమంలో సందడి నెలకొంది. నైజీరియన్లు సందడి చేశారు. 1960 అక్టోబర్ 1న స్వాతంత్య్రం పొందిన నైజీరియా దేశస్థులు నైజీరియన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణా స్టేట్ ఆధ్వర్యంలో ప్రీ ఇండిపెండెన్స్ వాక్‌ను ’ఎ వాక్ ఫర్ చేంజ్’ పేరిట నిర్వహించారు. ఈ వాక్‌లో పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు. విధ రకాల ఆటలు, ఫన్ గేమ్స్, నృత్యప్రదర్శనలు, గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఫిట్జాప్ ఆధ్వర్యంలో చిన్నారులు, ఇతరులకు ఫిట్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. షెల్ స్టూడియో డిజైన్ ఎన్ ఎల్ఎల్పి ఆధ్వర్యంలో స్నేక్ అండ్ ల్యాడర్ పోటీలు, డెవిల్స్ సర్య్కూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినూత్న క్రీడ, కియా డాల్స్, ఫేస్ పేయింటింగ్ కార్యక్రమాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్ ఫ్రీ థర్స్డే కార్యక్రమంపై ప్రచారం చేశారు. -
స్నేహంగా రాహ్‌గిరి..
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆదివారం ‘రాహ్‌గిరి’ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. విభిన్న చిత్రాలు, ఉర్రూతలూగించే సంగీతానికి అనుగుణంగా రోడ్లపై స్టెప్పులు, ప్రత్యేక ఆటలు జోష్ నింపాయి. ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్కు రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఆటాపాటలతో రాహ్‌గిరి సాగింది. హెపటైటిస్ అవగాహన నడకలో ఉద్యోగులు, యువత, చిన్నారులు పాల్గొన్నారు. కార్‌పూలింగ్, కార్ ఫ్రీ పేరిట అవగాహన కల్పించారు. హుక్స్ హూపింగ్, రన్నింగ్, స్కేటింగ్, యోగా, జుంబా డ్యాన్స్‌తో సందడి చేశారు. - సెంట్రల్ యూనివర్సిటీ