
‘ప్రకాశం’ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా బాలినేని
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.