అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దార్శినికుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దార్శినికుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి అక్కినేనికి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70 ఏళ్లుగా తెలుగు ప్రజలను అక్కినేని రంజింపచేశారని గుర్తు చేశారు.
అక్కినేని మరణం తెలుగుజాతికి విషాదమని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. అనేక మందికి ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. అక్కినేని జీవితం, ఒక పాఠం, ఒక చరిత్ర అని కీర్తించారు.