విరాళాలతో అన్నా క్యాంటీన్ల నిర్వహణా?.. సిగ్గుచేటు: కాకాణి | Kakani govardhan reddy Comments On Chandrababau At Nellore | Sakshi
Sakshi News home page

విరాళాలతో అన్నా క్యాంటీన్ల నిర్వహణా?.. సిగ్గుచేటు: కాకాణి

Published Thu, Aug 15 2024 4:22 PM | Last Updated on Thu, Aug 15 2024 6:21 PM

Kakani govardhan reddy Comments On Chandrababau At Nellore

అమలు చేయని పథకాలకు శకటాలా? 

సూపర్‌ సిక్స్‌ హామీలపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఊసేదీ?

మరోసారి అజ్ఞానాన్ని ప్రదర్శించిన పవన్‌

టీడీపీ పాలనలోని కేసులను మాకు ఆపాదించడమేంటి?

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు: ప్రజా వ్యతిరేక విధానాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్‌ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన బాబు.. ఇప్పుడేమో ఆ హామీలు అమలు చేయడంపై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు విధానాలు ఇలానే ఉంటాయని ప్రజలకు మరోసారి క్లియర్‌గా అర్థమైందని దుయ్యబట్టారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ హామీలపై బాబు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు.

ఈ  మేరకు గురువారం నెల్లూరులో కాకాణి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించని సీఎం చంద్రబాబు, తానేమీ మారలేదని మరోసారి రుజువు చేశారని.. టెర్రరిజం గురించి, నియంత పాలన గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే, దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

రాజధాని అమరావతి విషయంలో ప్రజల కోసం కాకుండా రియల్‌ ఎస్టేట్‌ ధనదాహంతో ఆలోచించారని కాకాణి తేల్చి చెప్పారు. రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లంటూ పదే పదే అబద్ధాలు చెప్పిన చంద్రబాబు, దమ్ముంటే వాటిని నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే, టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దోపిడి చేస్తున్నారన్న కాకాణి, ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి మాయం చేశారని ఆరోపించారు. 

తల్లికి వందనం అంటూ ఈ ఏడాదికి ఎగనామం పెట్టిన పథకానికి స్వాతంత్య్ర దినోత్సవాన శకటం ప్రదర్శించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఊసెత్తని చంద్రబాబు, రెడ్‌ బుక్‌ పాలనకే మొగ్గు చూపుతాం అన్న సంకేతాలివ్వడం దారుణమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఒక్క మంచి పని చేయని చంద్రబాబు, ఇప్పుడు కూడా 16 మంది సీనియర్‌ ఐపీఎస్‌లను వేధిస్తున్నారని, ఇది సీఎం అనైతిక పాలనకు పరాకాష్ట అని అభివర్ణించారు. ఇదే పంథాలో కొనసాగితే చంద్రబాబు నుంచి ప్రజలు స్వాతంత్య్రం తెచ్చుకునే పరిస్థితి త్వరలోనే వస్తుందని కాకాణి హెచ్చరించారు. 

అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేసిన మాజీ మంత్రి, వాటన్నింటికీ పచ్చ రంగు ఎందుకు వేశారని నిలదీశారు. ఇంకా.. ఆ క్యాంటీన్లలో పెద్ద పెద్ద ఫొటోలు నీవి, విరాళాలు ప్రజలవా? అని చంద్రబాబును ప్రశ్నించారు. పథకాలు ఎత్తేసి, పేదవాడికి పప్పన్నం పెడుతున్నారని.. దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారన్న కాకాణి, అది కూడా ప్రభుత్వ సొత్తుతో కాకుండా విరాళాలతో చేయడం విడ్డూరమన్నారు.  

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా మరోసారి పవన్‌కళ్యాణ్‌ తన ఆజ్ఞానాన్ని చాటారని మాజీ మంత్రి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017లో జరిగిన సుగాలి ప్రీతి కేసును, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ముచ్చుమర్రి బాలిక కేసును.. గత జగన్‌గారి ప్రభుత్వానికి ఆపాదించారని గుర్తు చేశారు. తాను ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నానన్న విషయాన్ని పవన్‌ మర్చారని కాకాణి గోవర్థన్‌రెడ్డి చురకలంటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement