సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చిరునవ్వుతో పూర్తిగా ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మరణించారంటే ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ రెడ్డి అకాల మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
చదవండి: మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి కోసమే
మంత్రి మేకపాటి గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న తరువాత ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. రావడం వెంటనే నిన్న రాత్రి నెల్లూరులో ఒక నిశ్చితార్థం కార్యక్రమంలో గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.
అక్కడ బంధువులతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోలో కూడా చాలా సరదాగా కనిపిస్తున్నారు. ఇదే గౌతమ్ రెడ్డి దిగిన చివరి ఫోటోగా భావిస్తున్నారు. ఫంక్షన్ తరువాత తిరిగి హైదరాబాద్‌లోని ఇంటికెళ్లిపోయారు. తెల్లవారేసరికి, గౌతమ్‌రెడ్డికి గుండెపోటు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూడం అన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.
చదవండి: Mekapati Goutham Reddy: తండ్రికి తగ్గ తనయుడు.. ఒకే ఒక్కడు..
Comments
Please login to add a commentAdd a comment