మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక మహిళలకు భరోసా దొరికి వారి కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం ఉంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. వేదాయపాళెంలోని ఎమ్వీఎస్ కల్యాణమండపంలో రూరల్ నియోజకవర్గానికి చెందిన మహిళలతో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ కొడితే 108 కంటే వేగంగా మద్యం వస్తోందని ఆరోపించారు. ఆదాయం పెంచుకునేందుకు మద్యం దుకాణాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు.
జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యాన్ని విక్రయించకూడదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిస్తే, చంద్రబాబు మాత్రం విక్రయించుకోవచ్చని జీఓ ఇవ్వడం దుర్మార్గమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేయనున్నారని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశమివ్వాలని కోరారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ మహిళా విభాగ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, కార్పొరేటర్ లక్ష్మీసునంద, తోట శోభారాణి, చేజర్ల కవిత, హురియా, తిప్పిరెడ్డి మమతారెడ్డి, జమునమ్మ, నీళ్ల పెంచలమ్మ, భారతి, సుజితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment